Good Luck Sakhi Trailer : 'నేను నిజంగానే బ్యాడ్‌లక్' అంటోన్న కీర్తి సురేష్..!

Good Luck Sakhi Trailer : నేనే నిజంగానే బ్యాడ్‌లక్ సఖి అంటుంది హీరోయిన్ కీర్తి సురేష్.. ఆమె మెయిన్ లీడ్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి.. ఈ నెల(జనవరి) 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్.. ఇందులో కీర్తి ఓ గ్రామీణ యువతిగా కనిపిస్తోంది.
''మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను'' అని జగపతిబాబు చెప్పే డైలాగ్‌లతో చిత్ర ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఎంట్రీ, ఆమెను అందరూ బ్యాడ్ లక్‌సఖి అని అంటుండడం, చివరికి ఆమె షూటర్ వంటివి ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. నగేష్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com