ఈ విషయంలో కీర్తి సురేష్ ది బెస్ట్ అనాల్సిందే

ఈ విషయంలో కీర్తి సురేష్ ది బెస్ట్ అనాల్సిందే
X

రీజినల్ లాంగ్వేజ్ తో మొదలై.. ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగులో మహానటితో తనలోని బెస్ట్ యాక్ట్రెస్ ను చూపించింది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ శ్రుతి మించిన గ్లామర్ ప్రదర్శించలేదు. ఎక్కువగా హద్దుల్లోనే కనిపించింది. అలాంటి తను సడెన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ రాణించాలంటే అవసరమైన తళుకులు ప్రదర్శించేందుకూ ఒకే అనేసినట్టు తన లేటెస్ట్ మూవీ బేబీ జాన్ సాంగ్ చూస్తే అర్థం అయింది. ఈ ఫీల్డ్ లో ఇవన్నీ కామనే. అయితే ఒక్క విషయంలో మాత్రం కీర్తి సురేష్ ను ది బెస్ట్ అనేస్తున్నారంతా.

ఏ ఇండస్ట్రీలో అయినా గాసిప్ లు అనేవి కుప్పలుగా కనిపిస్తాయి. వీటిలో ఆధారం లేనివి తక్కువగానే ఉంటాయి. అయితే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ విషయంలో చిన్న వార్త కూడా బయటకు రాలేదు. దీంతో ఇది ఈ మధ్యే స్టార్ట్ అయిన ప్రేమాయణం అనుకున్నారు చాలామంది. బట్ అదేం కాదు.. తాము 15యేళ్లుగా ప్రేమలో ఉన్నాం అనే న్యూస్ ను తనే స్వయంగా అనౌన్స్ చేసింది కీర్తి. ఇన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నా.. ఒక్క చిన్న వార్త కూడా బయటకు రాలేదు అంటే తను ఎంత ప్లాన్డ్ గా ఉందో అర్థం కావడం లేదూ. అసలు చిన్న ఫోటో కనిపిస్తేనే పెద్ద కథలు అల్లేస్తున్న కాలంలో అతనెవరో కూడా తెలియకుండా ఇన్నేళ్లు దాయడం అంటే గ్రేట్ అనే అంటున్నారు. అందుకే ఈ విషయంలో కీర్తి సురేష్ ను ది బెస్ట్ అంటున్నారు.





Tags

Next Story