Keerthy Suresh : కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Keerthy Suresh :  కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
Keerthy Suresh : మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుడ్‌ లక్‌ సఖి'... నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Keerthy Suresh : మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుడ్‌ లక్‌ సఖి'... నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఎట్టకేలకు గుడ్‌ లక్‌ సఖి సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. స్పోర్ట్స్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో జగపతిబాబు, ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో పాటుగా మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా చిరంజీవి హీరోగా వస్తోన్న భోళా శంకర్ సినిమాలో ఓ కీరోల్ పోషిస్తోంది.


Tags

Next Story