Keerthy Suresh : పెళ్లి కూతురుగా కీర్తి సురేష్ ఫోటోస్ వైరల్

Keerthy Suresh :  పెళ్లి కూతురుగా కీర్తి సురేష్ ఫోటోస్ వైరల్
X

కీర్తి సురేష్ పెళ్లయిపోయింది. చాలా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గోవాలో నిరాడంబరంగా తను ప్రేమించిన ఆంటోనీ తట్టిల్ తో మూడు ముళ్లు వేయించుకుందీ ముద్దుగుమ్మ. వీరు ఎందుకు ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ.. పెళ్లి కూతురుగా కీర్తి మెరిసిపోతోంది. ఇప్పటి వరకూ తను ప్రేమించిన ఆంటోనీ ఫోటోస్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. అతన్ని డైరెక్ట్ గా పెళ్లి కొడుకుగానే చూపించింది కీర్తి సురేష్.

ఆంటోనీది బిజినెస్ ఫ్యామిలీ. కేరళతో పాటు తమిళనాడులో కూడా వారికి వ్యాపారాలున్నాయి. ఈ ఇద్దరూ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి కీర్తి సురేష్ లో లవ్ యాంగిల్ ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. అంతా సడెన్ గా అనుకుంటున్నారు కానీ.. ఇది ప్రేమతో పాటు పెద్దలు కుదిర్చిన వివాహం. హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో ఈ పెళ్లి జరిగింది. గోవా వేదికగా ఓ రిసార్ట్ లో కీర్తి సురేష్ మెడలో మూడు ముళ్లు వేశాడు ఆంటోనీ తట్టిల్.

Tags

Next Story