Keerthy Suresh : కీర్తి మెస్మరైజ్.. చీరలలోనే మోడ్రన్ టచ్

Keerthy Suresh : కీర్తి మెస్మరైజ్.. చీరలలోనే మోడ్రన్ టచ్
X

తన తల్లి మేనక వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో నాని, రామ్, మహేశ్ బాబు, కోలీవుడ్ లో విజయ్, ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించి సౌండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ లో నటించడం ఈఅమ్మడు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. గతేడాది 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తి.. గతంలో మునుపెన్నడూ లేని సరికొత్త అందంతో ప్రస్తుతం సందడి చేస్తోంది. తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ తో పెండ్లి తర్వాత ఎక్కువగా ఈ బ్యూటీ చీరలలోనే కనిపిస్తున్న కూడా వాటికి మోడ్రన్ టచ్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా 'అక్క' వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో వైట్ కలర్ శారీలో, కర్లీ హెయిర్ తో ఉన్న మోడ్రన్ మహారాణిలా కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యారేజీ తర్వాత ఆమె స్టైల్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ లో పూర్తిగా మార్పు వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా క్వీన్ లా రాజసం ఉట్టిపడే విధంగా కీర్తి లుక్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే మెయింటేన్ చేస్తే కచ్చితంగా బాలీవుడ్ లో ఆమె స్పీడ్ పెరగడం ఖాయం అని అందరు అనుకుంటున్నారు.


Tags

Next Story