Keerthy Suresh : సుధా కొంగర డైరెక్షన్‌లో కీర్తి సురేష్ సినిమా.. కథేంటంటే..?

Keerthy Suresh : సినీఇండస్ట్రీలో మహిళా టాప్ డైరెక్టర్‌లో ఒకరైన సుధా కొంగర మరో అతి పెద్ద ప్రాజెక్ట్‌తో మనముందుకు వస్తున్నారు. కోలీవుడ్‌కు చెందిన సుధా కొంగర చిత్రాలు అటు ఇతర భాషల్లో కూడా డబ్, రీమేక్ అయి ఘనవిజయాన్ని సాధించాయి. సూరరై పోట్రు, సాలా ఖడూస్, పావా కథైగల్, పుథమ్ పుధు కాధై లాంటి ఎన్నో హిట్ చిత్రాలను సుధ కొంగర తెరకెక్కించారు.
తాజాగా కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధా కొంగర డైరెక్షన్‌లో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుంది. కీర్తి సురేశ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌లో అదరగొడుతున్నారు. గుడ్ లక్ సఖి, మహానటి, సాని లాంటి చిత్రలతో కలెక్షన్లతో పాటు అవార్డులను సొంతం చేసుకుంటున్నారు కీర్తి సురేష్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com