Keerthy Suresh: కృతి శెట్టి ప్లేస్‌లో కీర్తి సురేశ్.. యంగ్ హీరోతో సినిమా..
Keerthy Suresh: టాలీవుడ్‌లోకి అలా ఎంట్రీ ఇవ్వగానే.. ఇలా బిజీ అయిపోయింది కృతి శెట్టి.. ప్రస్తుతం కృతి డేట్లు అస్సలు ఖాళీగా లేవు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా అందరితో జతకడుతూ బిజీగా ఉంది బేబమ్మ. టాలీవుడ్‌లోనే కాదు.. తాజాగా కోలీవుడ్‌లో కూడా డెబ్యూకు సిద్ధమయ్యింది కృతి. అయితే తాజాగా కృతి నటించాల్సిన ఓ సినిమాలో కీర్తి సురేశ్ నటించనుందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కృతి శెట్టి ఇప్పటికే ఎన్నో సినిమా ఆఫర్లను వదిలేసుకుంది. అయితే తాజాగా యంగ్ హీరో శర్వానంద్ సినిమాలో కూడా కృతి ఛాన్స్ కొట్టేసిందట. కానీ అందులో తల్లి పాత్ర చేయాల్సి ఉండడంతో కృతి దానిని రిజెక్ట్ చేసిందట. అయితే తల్లి పాత్ర అయినా తనకు ఓకే అని కీర్తి దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
కీర్తి సురేశ్‌కు కథ నచ్చితే చాలు.. ఎలాంటి పాత్ర చేయడానికి అయినా వెనకాడదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పటికే స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కీర్తి సురేశ్.. ఇదివరకు నటించిన 'పెంగ్విన్' అనే చిత్రంలో తల్లి పాత్రలో కనిపించింది. ఇప్పుడు మరోసారి శర్వానంద్ సినిమాలో తల్లిగా చేసి మెప్పించడానికి సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com