Keerthi Suresh : అతడు చేసిన పని ఎప్పటికీ మర్చిపోను: కీర్తి సురేశ్

X
By - Manikanta |5 Aug 2024 1:15 PM IST
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ సందర్భంగా తాను లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోని ఓ సంఘటన గురించి హీరోయిన్ కీర్తి సురేశ్ మీడియాతో చెప్పారు. ‘నా ఫ్యాన్ ఒకరు ఓ రోజు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి తీరు చూసి నేను షాకయ్యాను’ అని తెలిపారు. దసరా సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని హీరోగా నటించిన ఈ మూవీలో కీర్తి.. వెన్నెల పాత్రలో ఆమె చేసిన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే తనకు ఫిల్మ్ ఫేర్ వచ్చిన సందర్భంగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనకు వచ్చిన ఒక పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com