Keerthy Suresh: ఎక్స్‌పోజింగ్‌పై కీర్తి సురేశ్ హాట్ కామెంట్స్..

Keerthy Suresh (tv5news.in)
Keerthy Suresh: ఒకప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ యాడ్ చేయడానికి మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. హీరోయిన్లు కూడా సినిమాల్లో ప్రాధాన్యత కోరుకుంటున్నారు. అందుకే దర్శకులు కూడా వారికి అలాంటి పాత్రలే డిజైన్ చేస్తున్నారు. అందుకే కొందరు హీరోయిన్లు కూడా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా దీనిపై స్పందించింది కీర్తి సురేశ్.
'నేను శైలజా' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది కీర్తి సురేశ్. మొదటి సినిమా నుండే ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓకే చెప్తూ వస్తోంది. అందుకే కీర్తి తన కెరీర్‌లో నటించిన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ. వాటిలో కూడా తను ఎక్స్‌పోజింగ్‌కు ఏ మాత్రం ఓకే చెప్పలేదు. దీంతో తనకు అభిమానులు కూడా ఎక్కువయ్యారు. తాజాగా ఎక్స్‌పోజింగ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది కీర్తి.
మొదటి నుండి తాను నటనపైనే దృష్టి పెట్టానని, అదృష్టం కొద్దీ తనకు అలాంటి పాత్రలే వచ్చాయని కీర్తి సురేశ్ పేర్కొంది. తెరపై గ్లామర్‌గా కనిపించే విషయంలో తనకు తానే కొన్ని పరిమితులు పెట్టుకున్నానని బయటపెట్టింది. అందుకే వాటిని అధిగమించలేనని ముక్కుసూటిగా చెప్పేసింది. తన ఆలోచన విధానం, తన నటన నచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా తనను అభిమానిస్తారని ధీమా వ్యక్తం చేసింది కీర్తి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com