Mega Star Chiranjeevi: చిరంజీవి చెల్లెలు ఈ స్టార్ హీరోయిన్.. ఏ చిత్రంలో అంటే..
![Mega Star Chiranjeevi: చిరంజీవి చెల్లెలు ఈ స్టార్ హీరోయిన్.. ఏ చిత్రంలో అంటే.. Mega Star Chiranjeevi: చిరంజీవి చెల్లెలు ఈ స్టార్ హీరోయిన్.. ఏ చిత్రంలో అంటే..](https://www.tv5news.in/h-upload/2021/08/07/527416-chiranjeevi.webp)
Mega Star Chiranjeevi: 65 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటిస్తున్న ఆచార్య చిత్రం దాదాపు పూర్తయి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవి వేదాళంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్.
ఈ చిత్రలో సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. చిరుకి చెల్లెలుగా నటించేందుకు మొదట సాయి పల్లవిని అనుకున్నా ఎందుకో అది వర్కవుట్ కాలేదు. తాజాగా మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్‌కి చెల్లెలైతే బావుంటుందని యూనిట్ భావించి ఆమెని కలిసింది. ఆమె భారీ రెమ్యునరేషన్‌తో బరువైన చెల్లెలి పాత్రను చేయడానికి ఒప్పుకుందట. ఇందుకు సంబంధించి ఆమె ప్రాజెక్ట్ పేపర్‌పై సంతకం చేసినట్లు తెలిసింది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. షూట్ ప్రారంభమైనప్పుడు ఆమె సెట్స్‌లో జాయిన్ అవుతుందని మేకర్స్ తెలియజేశారు. వేదాళం రీమేక్‌లో బ్రదర్-సిస్టర్ ట్రాక్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా కోసం ఆమెను తీసుకురావడానికి మేకర్స్ కీర్తి సురేష్‌కు భారీ పారితోషికం చెల్లించినట్లు తెలిసింది.
AK ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 న అధికారికంగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ ముమ్మరంగా జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com