Keerthy Suresh : కీర్తి సురేష్ అక్క రెడీ అవుతోంది..

Keerthy Suresh :  కీర్తి సురేష్ అక్క రెడీ అవుతోంది..
X

కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా బలమైన లైనప్ ఉంది. తను సెలెక్టివ్ గానే మూవీస్ చేస్తోంది. అలాగని పెళ్లి తర్వాత స్పీడ్ తగ్గించలేదు. అయితే గతంలోనే రెడీ అయిన మూవీస్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ లో భాగంగానే ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన అక్క అనే వెబ్ సిరీస్ బాగా ఆలస్యం అయింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాల్సి ఉంది. బట్ ఆ టైమ్ కు అది రాలేకపోయింది. అయితే ఈ మూవీ టీజర్ కు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ కెరీర్ లో ఓ స్పెషల్ గా ఉండబోతోంది అనిపించేలా ఉంది. చూస్తే ఈ సిరీస్ మాత్రం బాగా ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ యేడాది మార్చిలో విడుదల కాబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. మార్చిలో ఖచ్చితంగా ఈ అక్క సిరీస్ విడుదలవడం ఖాయం అని చెబుతున్నారు.

ఇక కీర్తి సురేష్ లైనప్ లో మాత్రం మూడు సినిమాలున్నాయి. వీటిలో కన్నెవేడి అనే తమిళ్ మూవీ ఉంది. తొట్టమ్ అనే మళయాలం మూవీతో పాటు తెలుగులో రౌడీ జనార్థన్ కూడా రెడీ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లోనూ భిన్నమైన పాత్రల్లో కనిపించబోతోంది అని చెబుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రివాల్వర్ రీటా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విచిత్రంగా ఈ మూవీ కూడా ఏడాది తర్వాత విడుదలైంది. మరి అక్క సిరీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో.

Tags

Next Story