సినిమా

Model Sahana : పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజు.. బాత్రూమ్‌లో విగతజీవిగా..!

Model Sahana : బర్త్ డేనే ఆమెకి డెత్ డే అయింది.. కేరళకి చెందిన మోడల్‌ షహానా చనిపోయింది.. అయితే అమెది హాత్యానా లేకా ఆత్మహత్యనా అన్నది తెలియదు..

Model Sahana : పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజు..  బాత్రూమ్‌లో విగతజీవిగా..!
X

Model Sahana : బర్త్ డేనే ఆమెకి డెత్ డే అయింది.. కేరళకి చెందిన మోడల్‌ షహానా చనిపోయింది.. అయితే అమెది హాత్యానా లేకా ఆత్మహత్యనా అన్నది తెలియదు.. కానీ షహానా కుటుంబీకులు మాత్రం ఇది హత్యేనని, షహానాని ఆమె భర్తనే చంపేశాడని ఆరోపిస్తుండడంతో పోలీసులు షహానా భర్త సజ్జద్‌ ని అదుపులోకి తీసుకున్నారు.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన షహానా ఓ మోడల్.. నిన్న( మే12)న ఆమె తన 21వ పుట్టినరోజు జరుపుకుంది..

అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో షహానా చనిపోయిందని ఆమె కుటుంబానికి ఫోన్ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆమె కుటుంబీకులు ఇదే హత్యేనని, షహానాని ఆమె భర్త సజ్జద్‌ చంపేశాడని ఆరోపించారు. షహానా పలు జ్యువెలరీ యాడ్స్‌లో నటించి ఏడాదిన్నర క్రితం సజ్జాద్‌ను పెళ్లాడింది. అయితే అత్తింట్లో టార్చర్ భరించలేక గతవారం బయటకు వచ్చేసి భర్త సజ్జద్‌ తో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె చనిపోవడం ఆమె కుటుంబసభ్యులను షాక్ కి గురిచేసింది.

దీనిపైన షహానా తల్లి మాట్లాడుతూ.. షహానాకి అత్తింట్లో టార్చర్ ఉందని, ఆమె భర్తతో పాటుగా తని తల్లిదండ్రులు, సోదరి కూడా తన కూతురికి నరకం చూపించేవారని తెలిపింది. అయితే తనని వేరే కాపురం పెట్టమని సూచించానని పేర్కొంది. సజ్జద్‌ కూడా డబ్బు కోసం దారుణంగా ప్రవర్తిస్తున్నాడని తన కూతురు పలుమార్లు వాపోయినట్టుగా తెలిపింది. షహానా తన పుట్టినరోజున మమ్మల్ని కలవాలనుకున్నా అందుకు వాళ్లు ఒప్పుకోలేదని తెలిపింది.

ఇక ఇదే విషయం గురించి ఏసీపీ కె సుదర్శన్‌ మాట్లాడుతూ.. షహానాకి ఓ తమిళ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిందని, దీనికి గాను షహానా రెమ్యునరేషన్ కూడా అందుకుందని కానీ దీనిపైన భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలిపారు. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్‌ ఆలస్యంగా రావడంతో గొడవ మరింత ఎక్కువైందని, ఆ తర్వాత బాత్రూమ్‌లో షహానా శవమై కనిపించిందని అన్నారు.. అయితే ఇది హత్యా లేకా ఆత్మహత్యా? అన్నది విచారణలో తెలుస్తుందని అన్నారు.

Next Story

RELATED STORIES