Kerthy Suresh: ఏమైంది కీర్తి సురేష్‌కి.. ఎందుకిలా..

Keerthy Suresh: గ్లామర్ ప్రపంచంలో ఎంటరైతే ఏ పాత్ర అయినా చేయాల్సిందేనే... ఒక రేంజ్ వరకే ఇష్టా ఇష్టాలతో పని ఉంటుందా. అందరూ ఒక తానులోని ముక్కల్లానే ప్రవర్తిస్తారా.. మహానటిగా మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట వంటి కమర్షియల్ సినిమాల్లో నటించి తానూ గ్లామర్ పాత్రలు కూడా చేయగలనని హింట్ ఇచ్చిందేమో దర్శక నిర్మాతలకు.
తాజాగా తాను దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి.. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫోటోలో ఉన్నది కీర్తి అంటే నమ్మలేకపోతున్నారు. ఆమె ఏంటి.. ఇలాంటి డ్రస్‌లో కనిపించడం ఏంటని అనుకుంటున్నారు.. అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ తనను తాను గ్లామర్ క్వీన్ ఆఫ్ ది సీజన్‌గా చూపించుకునే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు అని తెలుస్తోంది.
'సర్కారు వారి పాట'లోని మురారి పాట తన అందమైన గ్లామ్ యాంగిల్‌ని చూసి చాలా మందిని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అది కాస్తా వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ షోల్డర్ డ్రాపింగ్ గౌను ధరించి, ఆమె తన మోడరన్ లుక్‌ను ప్రదర్శించింది.
సినీ పరిశ్రమలోని అనేక ఇతర గ్లామ్ గర్ల్స్‌తో సమానంగా తన కెరీర్‌లో ముందుకు సాగడానికి ఆమె ఈ తరహా డ్రెస్ వేసుకుని ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. వర్క్ ఫ్రంట్‌లో కీర్తి సురేష్ మామన్నన్, దసరా, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com