Ketika Sharma : ఆ పాత్రలో నటించాలన్నది నా డ్రీమ్ : కేతిక శర్మ

Ketika Sharma : ఆ పాత్రలో నటించాలన్నది నా డ్రీమ్ : కేతిక శర్మ
Ketika Sharma : ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ.

Ketika Sharma : 'రొమాంటిక్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆ తరువాత నాగశౌర్యతో కలిసి లక్ష్య స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో మెరిసింది. ఈ రెండు సినిమాలు గ్లామర్ రొమాంటిక్ జానర్‌కి చెందినవి. తాజాగా వైష్ణవ్‌తేజ్‌తో కలిసి రంగరంగ వైభవంగాలో నటించింది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పిక్చర్. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఓ ఇంటర్యూలో ఈ సినిమా గురించి తన అనుభవాల గురించి చెప్పుకుంది ఈ రొమాంటిక్ సుందరి.

రంగరంగవైభవంగాలో తన క్యారెక్టర్ పేరు రాధ అని చెప్పింది. ఇప్పటివరకు చేసిన గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఉంటుందటి. ఖుషి సినిమాలో భూమికను మళ్లీ గుర్తు చేస్తానంటుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసుకుంటూ వెళ్తానంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుట కామెంట్స్ కూడా చదువుతానని చెప్పింది. సినిమాల ఎంపికలో టాలీవుడ్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తానంటుంది. బయోపిక్ చిత్రాల్లో నటించాలనేది తన ముందున్న గోల్ అని చెప్పింది కేతిక శర్మ.

Tags

Read MoreRead Less
Next Story