సినిమా

Ketika Sharma: 'రొమాంటిక్' హీరోయిన్‌కు క్రేజీ ఛాన్స్.. మెగా హీరోతో మూవీ..

Ketika Sharma: ఇటీవల విడుదలయిన ‘రొమాంటిక్’ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

Ketika Sharma (tv5news.in)
X

Ketika Sharma (tv5news.in)

Ketika Sharma: ఇటీవల విడుదలయిన 'రొమాంటిక్' సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. యూత్‌ను, మాస్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో పూరీ జగన్నాధ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వడని మరోసారి నిరూపణ అయ్యింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వ పర్యవేక్షణలో తన కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్‌తో కేతిక శర్మ హీరోయిన్‌గా పరిచయమయ్యింది.

ఈమధ్య హీరోయిన్లు చేసిన మొదటి సినిమా విడుదల కాకముందే దర్శక నిర్మాతలు వారికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. కేతికకు కూడా ఆఫర్లు అలాగే వచ్చాయి. రొమాంటిక్ విడుదల కాకముందే యంగ్ హీరో నాగశౌర్యతో 'లక్ష్య'లో నటించే ఛాన్స్ కొట్టేసింది భామ. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే కేతికకు మెగా కాంపౌండ్ నుండి పిలువు వచ్చినట్టు టాక్.

'ఉప్పెన'లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత 'కొండపొలం'తో తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. తన తరువాతి చిత్రం ప్రారంభమయినా కూడా దాని నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. అయితే తాజాగా వైష్ణవ్ మరో కొత్త సినిమాకు షూటింగ్‌ను ప్రారంభించేశాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తరువాతి సినిమా గురించి ఎలాంటి వివరాలు తెలియకపోయినా.. తాను అరకులో షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో కేతిక శర్మ.. వైష్ణవ్‌తో రొమాన్స్ చేయనుందట. ఇప్పుడే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కేతిక అప్పుడే మెగా హీరోతో మూవీ చేసేస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

RELATED STORIES