KGF 2: 'కేజీఎఫ్ 2' ఫస్ట్ రివ్యూ.. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్..

KGF 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ.. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్..
KGF 2: కేజీఎఫ్ చాప్టర్ 2.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

KGF 2: శాండిల్‌వుడ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా ఏది అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు 'కేజీఎఫ్'. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ కలిసి ఈ సాహసం చేసి శాండిల్‌వుడ్‌కు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్ రెండో భాగం చాప్టర్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతలోనే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఓవర్సీర్ సెన్సార్ బోర్డ్ అభ్యర్థి ఉమైర్ సంధు.. ఈ మధ్య సౌత్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. తాను సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు రివ్యూలను కూడా ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇప్పటివరకు ఉమైర్ ఇచ్చిన రివ్యూలు దాదాపు కరెక్ట్ అయ్యాయి. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2కు కూడా ఫస్ట్ రివ్యూను ఇచ్చేశాడు ఉమైర్ సంధు.

కేజీఎఫ్ చాప్టర్ 2.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ఉమైర్ సంధు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన రివ్యూను షేర్ చేశాడు. 'కేజీఎఫ్ 2 మొత్తంగా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో స్టైల్, సబ్జెక్ట్ రెండిటితో పాటు ఆశ్చర్యపరిచే యాక్షన్, అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి.'

'ముఖ్యంగా యశ్ ఈ సినిమాకు ట్రంప్ కార్డ్‌లాగా నిలిచాడు. యశ్ చరిష్మా వల్లే సినిమా ఓపెనింగ్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి కానీ సినిమా ఎక్కువకాలం నడవాలంటే మాత్రం కంటెంటే ముఖ్యం. పైగా ఎక్కువరోజులు నడిచే సత్తా కూడా సినిమాలో ఉంది. కచ్చితంగా ఇదొక బ్లాక్ బస్టర్. అంతే కాకుండా యశ్ బెస్ట్ సినిమా.' అని రివ్యూను ఇచ్చాడు ఉమైర్ సంధు.



Tags

Read MoreRead Less
Next Story