KGF 2 Release Date: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఖరారు.. మరో మాస్ మసాలా సాంగ్‌తో..

KGF 2 Release Date: కరోనాకు భయపడి భారీ చిత్రాలన్నీ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.. మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుండడంతో తిరిగి విడుదల బాట పట్టాయి. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సింది.. అయితే ప్రతికూల పరిస్థితులు కారణంగా సినిమాను వాయిదా వేశారు.
తాజాగా కేజీఎఫ్ 2 విడుదల తేదీని కన్ఫర్మ చేశారు హోంబలే ఫిలింస్ నిర్మాతలు. చిత్ర బృందం పలు దేవాలయాలను సందర్శించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 ఏఫ్రిల్ 14 విడుదల కానుందని ప్రకటించారు. దీంతో ఈ చిత్రం విడుదల తేదీపై అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది.
చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మరో భారీ చిత్రం సమ్మర్ పోటీకి సిద్ధమైనట్లైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో తాజా అప్డేట్.. కేజీఎఫ్‌లోనూ ఓ స్పెషల్ సాంగ్.. లైగర్ భామ అనన్య పాండే చేయనుందని సమాచారం. కన్నడలో తమన్నా, హిందీలో మౌనీ రాయ్ ఈ పాటను చేశారు.
ఈ సాంగ్ చాలా పాపులర్ కావడంతో కేజీఎఫ్2లోనూ అలాంటి మాస్ సాంగ్ పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ షోలేలో పాపులరైన మెహబూబా మెహబూబా పాటను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ పాట చిత్రీకరణ కూడా ఇప్పటి ఆడియప్స్‌ని దృష్టిలో పెట్టుకుని మరికొంత మసాలా యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com