KGF 2 : కేజీఎఫ్ 2 మరో రికార్డు.. ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్స్‌లో టాప్

KGF 2 : కేజీఎఫ్ 2 మరో రికార్డు.. ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్స్‌లో టాప్
KGF 2 : ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్స్‌లో 90 ప్లస్ స్కోరు సాధించిన తొలిచిత్రంగా కేజీఎఫ్2 వరల్డ్ రికార్డు సృష్టించింది.

KGF 2 : కేజీఎఫ్ 2 మూవీ కలెక్షన్ల సునామీనే కాదు రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ విశ్లేషణలు, రేటింగ్స్ ఇచ్చే ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్స్‌లో 90 ప్లస్ స్కోరు సాధించిన తొలిచిత్రంగా కేజీఎఫ్2 వరల్డ్ రికార్డు సృష్టించింది.

తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి ఓర్‌మ్యాక్స్‌ పవర్‌ రేటింగ్ ఇచ్చింది. వీటితో పాటు 2022 తొలి అర్ధభాగంలో విడుదలైన చిత్రాల్లో 8.5 ఐఎండీబీ రేటింగ్స్‌తోనూ కేజీయఫ్‌2 అదరగొట్టింది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Tags

Next Story