KGF 2 Trailer: 'వైలెన్స్ నాకు నచ్చదు' అంటున్న యశ్.. కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్..

KGF 2 Trailer: వైలెన్స్ నాకు నచ్చదు అంటున్న యశ్.. కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్..
KGF 2 Trailer: కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే.. చాప్టర్ 2 కాస్టింగ్ విషయంలో, బడ్జెట్ విషయంలో మరింత భారీగానే కనిపిస్తోంది.

KGF 2 Trailer: సౌత్ సినీ పరిశ్రమలు అన్నింటితో పోలిస్తే శాండిల్‌వుడ్ అంటే ఓ చిన్నచూపు ఉండేది. ఆ చిన్నచూపు ఒక్క సినిమాతో తుడిచేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఒక కన్నడ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వగలదని, అంతే కాకుండా అందరినీ ఇంప్రెస్ చేయగలదని ప్రూవ్ చేసింది 'కేజీఎఫ్'. అయితే అర్థాంతరంగా ఆగిపోయిన కేజీఎఫ్ కథలో చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదల కానుండగా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

కన్నడలో యూత్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చకున్న యశ్‌.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఏ భాషా ప్రేక్షకుడు అయినా గుర్తుపట్టేంత పేరు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. అయితే మరోసారి కేజీఎఫ్ 2లో రాకీ భాయ్‌గా అందరినీ ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తున్నాడు.

కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే.. కేజీఎఫ్ చాప్టర్ 2 కాస్టింగ్ విషయంలో, బడ్జెట్ విషయంలో మరింత భారీగానే కనిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్లు రవీనా టండన్, సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ 2లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా రావు రమేశ్, ప్రకాశ్ రాజ్‌లాంటి వారికి కూడా సినిమాలో ప్లేస్ ఉంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్‌లో వైలెన్స్ నాకు నచ్చదు అంటూ యశ్ చెప్పే డైలాగ్ తన ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story