Harish Roy: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. సినిమాల్లో ఛాన్స్ ఇవ్వరేమో అని ఇన్ని రోజులు..

Harish Roy: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. సినిమాల్లో ఛాన్స్ ఇవ్వరేమో అని ఇన్ని రోజులు..
X
Harish Roy: యష్ నటించిన 'కేజీఎఫ్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అయితే ఈ చిత్రంలో ఖాసి చాచా పాత్రలో నటించిన ప్రముఖ నటుడు హరీష్ రాయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

Harish Roy: యష్ నటించిన 'కేజీఎఫ్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అయితే ఈ చిత్రంలో ఖాసి చాచా పాత్రలో నటించిన ప్రముఖ నటుడు హరీష్ రాయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. తనకు గొంతు క్యాన్సర్ నాల్గవ దశలో ఉందని చెప్పారు. క్యాన్సర్ కారణంగా తన గొంతుకు వాపు వచ్చిందని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేజీఎఫ్ లో గడ్డం పెచానని చెప్పారు.

క్లైమాక్స్‌కి సంబంధించిన కీలక సన్నివేశంలో ఊపిరి పీల్చుకోలేకపోయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. నటుడు మాట్లాడుతూ, "పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. విధిని తప్పించుకునే అవకాశం లేదు. నేను మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. KGF లో నటిస్తున్నప్పటికే నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. డబ్బు లేకపోవడంతో శస్త్రచికిత్సను కూడా వాయిదా వేసుకున్నాను. సినిమా విడుదలయ్యే వరకు వేచిచూశాను.

ఆర్థిక సహాయం కోసం ప్రజలను కోరుతూ వీడియో తీశానని, అయితే తాను దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేకపోయానని రాయ్ వెల్లడించారు. రాయ్ ప్రస్తుతం కిద్వాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా అతని ఊపిరితిత్తులకు ఇప్పటికే శస్త్రచికిత్స జరిగిందని, అయితే మరింత చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు. నటుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న కన్నడ చిత్ర పరిశ్రమ వెంటనే స్పందించింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అతనికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు.

Tags

Next Story