Malavika : KGF నటి మాళవిక భర్త ఎవరో తెలుసా?

Malavika : KGF నటి మాళవిక భర్త ఎవరో తెలుసా?
Malavika : కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ KGF.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.

Malavika : కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ KGF.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న పార్ట్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మాళవికకి మంచి పేరొచ్చింది.


మాళవిక కన్నడ, తమిళ్, మలయాళీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఇక ఆమె భర్త తెలుగులో ఓ విలన్ అన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు.. ఆమె భర్త పేరు అవినాష్.. స్టార్ హీరో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో ఆయన భూతవైద్యుడిగా నటించారు. అంతేకాకుండా రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాలో కూడా విలన్ గా నటించారు.


అవినాష్ మరియు మాళవిక 2001లో 'మాయామృగ' అనే సీరియల్‌లో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. KGF మూవీలో మాళవిక ఓ టెలివిజన్ ఛానల్‌లో చీఫ్ ఎడిటర్‌ పాత్రను పోషించింది. నిజజీవితంలో కూడా ఆమె పలు టెలివిజన్ ఛానల్‌లలో ఎడిటర్‌గా పనిచేసింది. 2013లో బీజేపీలో చేరిన ఆమె ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story