Mohan Juneja : KGF నటుడు కన్నుమూత..!

Mohan Juneja : KGF నటుడు కన్నుమూత..!
Mohan Juneja : శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు.. ఇటీవల KGFచాప్టర్ 2 లో నటించిన ఆయన గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Mohan Juneja : శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు.. ఇటీవల KGFచాప్టర్ 2 లో నటించిన ఆయన గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు.

మోహన్ జునేజా కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హాస్యనటుడిగా నటించి మెప్పించారు. దాదాపుగా 100 సినిమాల్లో ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల అభిమానులు మరియు శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మోహన్ జునేజా స్వస్థలం కర్ణాటకలోని తుమకూరు జిల్లా. ఆయన బెంగళూరులోనే విద్యాభ్యాసం చేసి అక్కడే స్థిరపడ్డాడు. ఈరోజు ఆయన అంత్యక్రియల జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story