KGF Chapter 2 : అమీర్ ఖాన్‌ను బీట్ చేసిన యశ్.. 22 రోజుల్లోనే నయా రికార్డు.. !

KGF2 : బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది 'కేజీఎఫ్2'.. కలెక్షన్లు చూస్తే మతిపోతుంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న రిలీజైంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన కేజీయఫ్ 2 విడుదలైన 22 రోజుల్లోనే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీ కలెక్షన్స్‌ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
దంగల్ చిత్రం లైఫ్‌టైం రన్‌లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును కేజీఎఫ్2 అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించాడు. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది.
కేజీయఫ్ 2కంటే ముందుగా బాహుబలి 2 సినిమా ఉంది. బాహుబలి హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. కాగా కేజీయఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. హోమ్ ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండిన్ వంటి బాలీవుడ్ స్టార్లు నటించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్3' కూడా వస్తుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com