KGF Chapter 2: సీక్వెల్ కోసం షాకింగ్ రెమ్యునరేషన్..!

KGF Chapter 2: సీక్వెల్ కోసం షాకింగ్ రెమ్యునరేషన్..!
KGF Chapter 2: 2018లో విడుదలైన సూపర్‌హిట్ మూవీ 'KGF'కి ఇప్పుడు సీక్వెల్‌గా రాబోతుంది. చాప్టర్ 2 పేరుతో తెరకెక్కిన సీక్వెల్ భారీ అంచనాల నడుమ రేపు (ఏప్రిల్ 14న) థియేటర్లలోకి వస్తోంది.

KGF Chapter 2: : 2018లో విడుదలైన సూపర్‌హిట్ మూవీ 'KGF'కి ఇప్పుడు సీక్వెల్‌గా రాబోతుంది. చాప్టర్ 2 పేరుతో తెరకెక్కిన సీక్వెల్ భారీ అంచనాల నడుమ రేపు (ఏప్రిల్ 14న) థియేటర్లలోకి వస్తోంది.. రాకీభాయ్ యష్ ని చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి, శెట్టి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించారు.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం కన్నడతో పాటుగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.

అయితే ఈ సినిమాకి హీరో యష్ తో పాటుగా ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఓ లుక్కేద్దాం...!

1. యష్ : రాకీ భాయ్ పాత్రలో కనిపించనున్న యష్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 27 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

2. సంజయ్ దత్: అధీర పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ నటుడు జయ్ దత్ ఈ సినిమాకు రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా సమాచారం.

3. రవీనా టాండన్: భారత ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించడానికి మేకర్స్ రవీనాను ఎంపిక చేశారు.. ఈ సినిమా కోసం ఆమె రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట.

4. ప్రశాంత్ నీల్: ఈ ప్రాజెక్ట్‌కి మెయిన్ పిల్లర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ రూ. 20 కోట్లు అని తెలుస్తోంది.

5. శ్రీనిధి:రీనా దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్న శ్రీనిధి శెట్టి ఈ చిత్రానికి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం.

6. ప్రకాష్ రాజ్: విజయేంద్ర ఇంగలగిగా కనిపించనున్న ప్రకాష్ రాజ్ రూ.82 లక్షలు చార్జ్ చేశారట.

7. అనంత్ నాగ్: ఆనంద్ ఇంగలగి పాత్రలో కనిపించనున్న అనంత్ నాగ్ రెమ్యునరేషన్ రూ.50 లక్షలు

8. మాళవిక అవినాష్: దీపా హెగ్డే అనే న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ పాత్రలో కనిపించనున్న మాళవిక అవినాష్ ఈ సినిమా కోసం రూ.60 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట.

Tags

Read MoreRead Less
Next Story