KGF Star Yash : కేజీఎఫ్ స్టార్ టాక్సిక్ అప్డేట్ తో రెడీ

KGF Star Yash :  కేజీఎఫ్ స్టార్ టాక్సిక్ అప్డేట్ తో రెడీ
X

కేజీఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యశ్. ఈ మూవీలో అతని నటన, గెశ్చర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కంట్రీ మొత్తం ఆ కటౌట్ కు ఫ్యాన్ అయిపోయారు. సెకండ్ పార్ట్ తో మరిన్ని రికార్డులు కొల్లగొట్టిన యశ్.. ఆ తర్వాత వెంటనే మరో సినిమా అనౌన్స్ చేయడానికి భయపడ్డాడు. చాలా టైమ్ తీసుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత చాలామంది అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా చూస్తున్నారు. అందుకే ఆచి తూచి అడుగులు వేయాలనే టైమ్ తీసుకున్నా అన్నాడు. ఫైనల్ గా గీతూ మోహన్ దాస్ అనే ఓ టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయ్యాడు.

టాక్సిక్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోబోతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో డీల్ చేసే వ్యక్తిగా యశ్ కనిపిస్తాడు అనే ప్రచారం జరిగింది. ఇక ఈ మూవీలో నయనతార హీరోకు సిస్టర్ గా కనిపిస్తుంది అన్నారు. తర్వాత కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది అని వినిపించింది. అలాగే కేజీఎఫ్ లో ప్రధానమంత్రిగా కనిపించిన రవీనాటాండన్ మరోసారి ఓ కీ రోల్ చేస్తుందన్నారు. బట్ ఇప్పటి వరకూ యశ్ తప్ప మిగతా తారాగణం గురించిన క్లారిటీ అయితే లేదు. మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కూడా. బట్ కొన్నాళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేస్తాం అని మాత్రం అఫీషియల్ గా ప్రకటించి ఉన్నారు.

ఇక లేటెస్ట్ గా టాక్సిక్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ నెల 8న ఉదయం 10.25 గంటలకు ఈ క్రేజీ అప్డేట్ ఇస్తారట. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. మరి వాళ్లు ఇచ్చే అప్డేట్ ఏంటో కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Next Story