కేజీఎఫ్ 2 టీజర్.. యశ్‌కు వార్నింగ్ నోటీసులు

కేజీఎఫ్ 2 టీజర్.. యశ్‌కు వార్నింగ్ నోటీసులు
దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర తొలి భాగానికంటే పదింతలు ఎక్కువ కష్టపడి అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం

కొన్ని సినిమాలకు పబ్లిసిటీ అక్కర్లేదు.. మరికొన్ని సినిమాలకు వివాదమే పబ్లిసిటీ.. కన్నడ నటుడు యశ్ నటించిన కేజీఎఫ్ రికార్డులు బ్రేక్ చేసింది.. ఇప్పుడు మళ్లీ కేజీఎఫ్ 2తో మరో ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే 2.16 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌తోనే ప్రేక్షకులందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.

బాహుబలి తరువాత ఆ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా నిలవనుంది. టీజర్ విడుదలైన 48 గంటల్లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కించుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర తొలి భాగానికంటే పదింతలు ఎక్కువ కష్టపడి అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది.

అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ నోటీసులు జారీ చేసింది. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీర్ యశ్ గన్‌తో వాహనాలను షూట్ చేసి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ వెలిగిస్తాడు.

ఆ సీన్ చూపించేటప్పుడు యాంటీ స్మోకింగ్ వార్నింగ్ వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమని తెలిసింది. దాంతో స్టేట్ యాంటీ టొబాకో సెల్ వారికి నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story