Khadgam Re-Release : అక్టోబర్ 2న 'ఖడ్గం'రీ రిలీజ్

Khadgam Re-Release : అక్టోబర్ 2న ఖడ్గంరీ రిలీజ్

దేశభక్తి ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం ఖడ్గం. ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శ కత్వం వహించారు. కార్తికేయ మూవీస్ ఆధ్వర్యంలో సుంకర మధు మురళి ని ర్మించారు. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ.. ముస్లిం యువకుడిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక ఇందులో హీరోయిన్ సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన అమాయకమైన పాత్రలో నటించి మెప్పించిం ది సంగీత. ఈ మూవీలో సంగీత క్యారెక్టర్స్, డ్రెస్సింగ్ అప్పట్లో చాలా ట్రెండ్ అయ్యాయి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ, సంగీత మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో సంగీతతోపాటు సోనాలి బింద్రే, కిమ్ శర్మ, పూజా భారతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను గాంధీ జయంతి రోజు రీ రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపాడు. 'వందేమాతరం' మీ అందరూ ప్రేమతో ఇచ్చిన ఆజ్ఞ మేరకు నిర్మాత మధు మురళి గారు అక్టోబర్ 2న ఖడ్గం మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. మీరు మరోసారి ఉద్విగ్నంగా ఆదరిస్తారని ఆశిస్తూ.. వందేమాతరం, జైహింద్' అని ట్విటర్లో పోస్ట్ పెట్టాడు.

Tags

Next Story