Khaleja Collections : మహేష్ బాబు ఖలేజా చూపిన అభిమానులు

Khaleja Collections :  మహేష్ బాబు ఖలేజా చూపిన అభిమానులు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఖలేజా. అతడు తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ. అలాగే ఈ ఇద్దరితో కలిసి అనుష్క పనిచేసిన ఫస్ట్ మూవీ. అప్పటికే మహేష్ పోకిరి, బిజినెస్ మేన్ అంటూ సీరియస్ మూవీస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి ఉండటంతో .. పూర్తిగా కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఖలేజా అప్పటి ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఈ మూవీలోని అంతర్గత సందేశం కూడా అర్థం కాలేదు. పైగా మహేష్ బాబు కామెడీ చేయడం ఏంటీ అని దర్శకుడిపై సీరియస్ అయ్యారు కూడా. కానీ కొన్నాళ్లకు టివిల్లో వస్తున్నప్పుడు, ఇతర ప్లాట్ ఫామ్స్ లో చూస్తున్నప్పుడు కానీ ఖలేజా కెపాసిటీ ఏంటో అర్థం కాలేదు. ఓ కల్ట్ స్టేటస్ ఉన్న మూవీగా ఫీలయ్యారు. బట్ థియేటర్స్ లో మాత్రం పోయిందీ సినిమా. దీంతో ఈ సారి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఈ శుక్రవారం ఖలేజా చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.

మొదటి రోజు ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అసలు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ఇవి. ఇంకా చెబితే తెలుగులో రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఖలేజా. ఖలేజా ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 7. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. ఓ రకంగా ఇది అభిమానులు చూపించిన ఖలేజా. ఖలేజా మూవీపై ఫ్యాన్స్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం ఈ కలెక్షన్స్. ఇంకా చెబితే సినిమా రిలీజ్ అయిన టైమ్ కు ఈ టైమ్ కు ఓ జెనరేషన్ మారింది. అంటే ఈ జెనరేషన్ ఫ్యాన్స్ చూపించిన సత్తా అని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతం కొత్తగా విడుదలైన సినిమాలు అంటే భైరవం మాత్రమే ఉంది. సో.. ఖలేజా లాంగ్ రన్ లో మరింత సత్తా చాటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే సత్తా ఉన్న మూవీయే అనుకోవచ్చు.

Tags

Next Story