Rekha Varma: రవితేజ ఓ చీప్‌స్టార్.. 'ఖిలాడి' డైరెక్టర్ భార్య షాకింగ్ కామెంట్స్

Rekha Varma: రవితేజ ఓ చీప్‌స్టార్.. ఖిలాడి డైరెక్టర్ భార్య షాకింగ్ కామెంట్స్
Rekha Varma: ఇక ఈ గొడవ జరుగుతున్న తరుణంలోనే రమేష్ వర్మ భార్య రేఖా వర్మ రవితేజపై కామెంట్ చేయడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిగ్గా మారింది.

Rekha Varma: ఖిలాడీ హీరో రవితేజ మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మపై ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌మీదే సెటైర్లు.. మాటల తూటాలు.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమోకానీ రవితేజ మాత్రం అసహనాన్ని ప్రదర్శించడంలో అస్సలు తగ్గలేదు. నువ్వంతంటే నేను ఇంకెంత అనాలి అంటూ డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖా వర్మ ఓ రేంజ్‌లో రవితేజపై ఫైర్ అయ్యారు.

ఖిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సింది అని నిర్మాత సత్యన్నారాయణను ఉద్దేశించి ఆ ఫంక్షన్లో అన్నాడు రవితేజ. అంతకు ముందు దర్శకుడు మహర్జాతకుడు.. కాకపోతే ఏంటి సినిమా రిలీజ్‌కు ముందే కారు కూడా కొనిపించుకున్నాడు అని రమేష్ వర్మపై ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేశాడు రవితేజ. రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడీ సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గానే చెప్పేశాడు.

సినిమా విడుదలకు ముందు రవి తేజ మరీ ఇలా మాట్లాడతాడని రమేష్ వర్మ ఊహించలేకపోయాడు. అది సినిమాపై ప్రభావం చూపిస్తుందని మదనపడ్డాడు.. ఇక ఈ గొడవ జరుగుతున్న తరుణంలోనే రమేష్ వర్మ భార్య రేఖా వర్మ రవితేజపై కామెంట్ చేయడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిగ్గా మారింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రవితేజను ఒక చీప్‌స్టార్ అని ఘాటుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.

గతంలో దర్శకుడు అజయ్ భూపతి కూడా ఇదే మాట రవితేజని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమవుతుంది అని రేఖావర్మ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో రవితేజ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. అసలు రవితేజకు, రమేష్ వర్మకు మధ్య ఏం జరిగింది అన్నది ఒక పాయింట్ అయితే మధ్యలో రేఖావర్మ ఎంటరవడం ఈ గొడవ ఎక్కడకు దారితీస్తుందో అని ఇండస్ట్రీవర్గీయులు భావిస్తున్నారు.

రవితేజ.. రమేష్ వర్మ కాంబినేషన్లో 2011లో వీర అనే సినిమా వచ్చింది. కానీ అది అంతగా ఆడలేదు.. ఆ తర్వాత దాదాపు పదేళ్లకు మళ్లీ వీరిద్దరి కాంబోలో ఖిలాడీ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఈ వివాదం చెలరేగింది.

Tags

Next Story