Dimple Hayathi: 'ఖిలాడి' భామ.. అప్పుడే బాలీవుడ్‌లో ఎంట్రీ.. ధనుష్‌తో కలిసి..

Dimple Hayathi (tv5news.in)
Dimple Hayathi: ఒక అమ్మాయి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమవ్వాలంటేనే కాదు.. నటిగా క్లిక్ అవ్వాలనుకున్నా కూడా లక్ కావాలి. ఒక్కొక్కసారి అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు రాక వెనకబడిపోవాల్సి వస్తుంది. అలా 2017లో ఇండస్ట్రీకి వచ్చి.. ఇంకా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోని డింపుల్ హయాతి.. తాజాగా 'ఖిలాడి' సినిమాతో అందరినీ మెప్పిస్తోంది.
ఇండియా నుండి దుబాయ్ వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'గల్ఫ్'. ఇదే డింపుల్ మొదటి చిత్రం. 2017 విడుదలయిన గల్ఫ్.. చిన్న సినిమా కావడంతో పెద్దగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది. ఇక తెలుగులో ఒక సినిమా చేయగానే కోలీవుడ్ నుండి అవకాశం అందుకుంది డింపుల్.
తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన 'అభినేత్రి 2'లో డింపుల్ ఓ క్యారెక్టర్ చేసింది. అభినేత్రి హిట్ అయినంతగా దాని సీక్వెల్ హిట్ అవ్వకపోవడంతో డింపుల్ గురించి, తన నటన గురించి పెద్దగా ఎవరికీ తెలీకుండా పోయింది. ఇక అదే సంవత్సరం తనకు ఓ ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్‌ను వదులుకోకుండా యాక్సెప్ట్ చేయడం తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అయ్యింది.
హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' చిత్రంలో డింపుల్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటలో గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తో కూడా ఆకట్టుకుంది. అప్పటినుండి తనకు పలు స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినా.. హీరోయిన్‌గానే యాక్ట్ చేయాలని ఉందంటూ ఖిలాడిలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ భామ ధనుష్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటించిన 'అత్రంగి రే' చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసి బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com