Khushi Kapoor : ప్లాస్టిక్ సర్జరీ నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న ఖుషీకపూర్

Khushi Kapoor : ప్లాస్టిక్ సర్జరీ నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న ఖుషీకపూర్
X

అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ సోదరి ఖుషీకపూర్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. పాత వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. తెరంగేట్రం చేయడానికి ముందు ముక్కు, పెదవుల (లిప్ ఫిల్లర్స్) ను శస్త్ర చికిత్సతో సరి చేయించుకున్నట్టు ఈ సందర్భంగా వివరించింది. ఈ వీడియోలో 'ఖుషి' తన తల్లి శ్రీదేవితో కలిసి ఒక ఈవెంట్ కు హాజరైంది. అప్పటికి తను చిన్నపిల్ల. ఇప్పుడు టీనేజీ అమ్మాయి. తన మొదటి ఓటీటీ చిత్రం 'ది ఆర్చీస్ ' ప్రీమియర్తో ఎంట్రీ ఇచ్చిన సమయంలో వీడియో అది. ఖుషి పాత రూపంపై ఒక నెటిజన్ ప్రశ్నించగా ప్లాస్టిక్ సర్జరీ చేయించు కున్నానంటూ సింపుల్గా చెప్పేసింది. ఖుషీ ఇంతకుముందు తన స్నేహితుడు వేదాంగ్ రైనాతో కలిసి 'ది ఆర్చీస్ 'లో నటించింది. ఇటీవల ఇండియా కోచర్ వీక్ డిజైనర్ గౌరవ్ గుప్తా షోలో షోస్టాపర్లుగా కనిపించారు. అక్క జాన్వీ బాటలోనే ఖుషీ కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సెప్టెంబర్ 1న మోక్షజ్ఞ తొలి చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆ రోజు ఖుషీ విషయంపై మరింత క్లారిటీ వచ్చ అవకాశం ఉంది. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ అన్న ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇందుకు సంబంధించిన పాటలు కూడా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మోక్షజ్ఞతో ఖుషీ నటిస్తే.. అన్న సరసన అక్క.. తమ్మడి సరసన చెల్లి అన్నట్టు అవుతుంది.

Tags

Next Story