Kiara Advani: దేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ.. కాబట్టే..: కియారా అద్వానీ

Kiara Advani: దేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ.. కాబట్టే..: కియారా అద్వానీ
Kiara Advani: తాను ఓ రీమేక్ సినిమాలో నటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందట కియారా.

Kiara Advani: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఏ భాష గొప్ప అనే రచ్చ రోజురోజుకీ పెద్దగా అవుతోంది. సీనియర్ నటీనటులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. బాలీవుడ్ అంతా ఒకవైపు.. సౌత్ ఇండస్ట్రీ అంతా ఒకవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎంతోమంది దీనిపై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా ఈ విషయంపై స్పందించపోయినా.. కియారా మాట్లాడిన మాటలు ఈ వివాదాన్ని ఉద్దేశించినట్టుగానే ఉన్నాయి.


తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవ్వడంతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జోడీకట్టింది కియారా అద్వానీ. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లోనే తాను ఎక్కువ బిజీగా గడిపేస్తోంది. ఇక కార్తిక్ ఆర్యన్‌తో జోడీకడుతూ కియారా నటించిన 'భూల్‌ భులాయా 2' చిత్రం త్వరలోనే విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కియారా. అంతే కాకుండా ఈ సందర్భంగానే తాను రీమేక్‌లపై పలు వ్యాఖ్యలు చేసింది.


తాను ఓ రీమేక్ సినిమాలో నటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందట కియారా. ఓటీటీలు ఫేమస్ అవ్వకముందే తాను కబీర్ సింగ్ చిత్రంలో నటించానని గుర్తుచేసుకుంది. కానీ ఓటీటీలో ఫేమస్ అయిన సినిమాను రీమేక్ చేసినప్పుడు అందులో నటించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని తెలిపింది.


కొన్ని చిన్న చిత్రాలు చాలా బాగుంటాయని కియారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ వాటిని ఒకే భాషలో తెరకెక్కిస్తారు కాబట్టి ఎక్కువమంది ప్రేక్షకులకు చేరదని తెలిపింది. అలాంటప్పుడు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి హిందీలో తెరకెక్కించడంలో తప్పు లేదని చెప్పింది కియారా.

Tags

Read MoreRead Less
Next Story