Kiara Advani: నచ్చిన హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వానీ..

Kiara Advani (tv5news.in)
Kiara Advani: ముందుగా టాలీవుడ్ ఒకట్రెండు సినిమాలు చేసిన నార్త్ ముద్దుగుమ్మలు.. కాస్త ఫ్లాపులు ఎదురవ్వగానే మళ్లీ బాలీవుడ్ బాటపడతారు. అలా కొన్నాళ్లకు మళ్లీ టాలీవుడ్ ఆఫర్లను అందుకుంటారు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో కామన్‌గా జరుగుతున్నది ఇదే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడిపేస్తున్న కియారా అద్వానీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
2014లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కియారా అద్వానీ. కానీ తన డెబ్యూ మూవీ తనకు అంతగా సక్సెస్‌ను అందించలేకపోయింది. రెండేళ్ల తర్వాత 'ఎమ్ ఎస్ ధోనీ' చిత్రంతో కియారాకు బ్రేక్ దొరికింది. ఈ సినిమా వల్లే తాను టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. మహేశ్ సరసన నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో కియారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
భరత్ అనే నేను సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కియారా అద్వానీ. కానీ వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ' ఆశించినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే మళ్లీ బాలీవుడ్‌కే తిరిగి వెళ్లిపోయింది. ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మాత్రమే కియారా చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్. అయితే త్వరలోనే తనకు నచ్చిన హీరోతో జతకట్టడానికి సిద్ధమవుతోదట కియారా.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలామంది బాలీవుడ్ భామలకు ఇష్టం. అలాగే తనకు కూడా విజయ్ అంటే క్రష్ అని కియారా చాలాసార్లు చెప్పింది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఇప్పుడు ఏకంగా హీరో, హీరోయిన్‌గా కనిపించనున్నారు. విజయ్ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించనున్న జనగణమన సినిమాలో కియారానే హీరోయిన్ అని టాలీవుడ్ సర్కి్ల్లో టాక్ గట్టిగా నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com