Kiara Advani : గేమ్ చేంజర్ పైనే కియారా ఆశలు

రాంచరణ్, కియారా అద్వానీ కాంబనేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ క్రిస్మస్కు రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ విజయం దక్కుతుందనే ఆశలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్. తాజాగా నిర్మాత దిల్ రాజు రిలీజ్ డేట్ను రివిల్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ ఎంఎస్ ధోని సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో కూడా నటించడం ద్వారా సౌత్ ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తోంది. హిందీలో రెండు మూడు సినిమాలను కూడా చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్గా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అందాల ఆరబోత ఫొటోలతో తన ఫాలోవర్స్ పెంచుకుంటోందీ అమ్మడు. బంగారు రంగు డ్రెస్లో దేవకన్యలా మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది. గోల్డెన్ ఔట్ ఫిట్తో కియారా అద్వానీ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ స్థాయిలో అందాల ఈ ఆరబోత చేయడం ఈ అమ్మడికే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com