Kiara : సినిమాలకు బ్రేక్ ఇస్తోన్న కియారా.. కారణమేంటో తెలుసా..?

చాలా తక్కువ టైమ్ లోనే మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వాని. అంతే ఫాస్ట్ తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు సరసన భరత్ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ లో మెరిసింది. తెలుగులో ఆఫర్స్ ఉన్నా.. హిందీలోనే చాలా బిజీగా ఉంది. బిజీగా ఉన్న టైమ్ లోనే నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కన్నడలో టాక్సిక్, హిందీలో వార్ 2 మూవీస్ చేస్తోంది కియార. వార్ 2 దాదాపు పూర్తయింది. టాక్సిక్ షూటింగ్ లో ఉంది. వీటికంటే ముందే తను డాన్ 3 చిత్రానికి కమిట్ అయింది. అయితే తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
డాన్ 3 చాలాకాలంగా ఆగుతూ వస్తోంది. పైగా షారుఖ్ ఖాన్ ను కాదని, రణ్వీర్ సింగ్ ను తీసుకున్నాడు ఫరాన్ అక్తర్. బాగా లేట్ అవడం వల్లే తప్పుకుంది అనుకున్నారు చాలామంది. బట్ నిజం ఏంటంటే.. తను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈ విషయం కన్ఫార్మ్ అయ్యాకనే డాన్ 3 నుంచి తప్పుకోవవడమే కాక కొత్త ప్రాజెక్ట్స్ ను కూడా ఒప్పుకోవడం లేదు. కేవలం టాక్సిక్ మాత్రం పూర్తి చేస్తే తర్వాత బిడ్డను కని ఆపై కెరీర్ గురించి ఆలోచించుకోవచ్చు అనుకుంటోందట. సో.. అదీ మేటర్. కియారా కొన్నాళ్ల పాటు వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటుందన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com