Nani's The Paradise : నాని ప్యారడైజ్ లో కిల్లర్

Nanis The Paradise :  నాని ప్యారడైజ్ లో కిల్లర్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న మూవీ ‘ద ప్యారడైజ్’. హైదరాబాద్ లోని ప్యారడైజ్ ప్రాంతంలో 80ల కాలంలో జరిగిన కథ అంటూ పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నానితోనే దసరా మూవీతో దర్శకుడుగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకుడు. సోనాలి కులకర్ణి ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన ఓపెనింగ్ వీడియోతోనే సంచలనం సృష్టించిందీ మూవీ టీమ్. నాని రీసెంట్ గా హిట్ 3తో విజయం అందుకున్నాడు. అందులోని వయొలెన్స్ చూసి తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంతకు ముందెప్పుడూ తెలుగు సినిమా అంత హింస చూడలేదు. అందుకు ఓ రకంగా ఇన్సిస్పిరేషన్ గా నిలిచిన సినిమా బాలీవుడ్ ‘కిల్’. ఇప్పుడు ఈ చిత్ర హీరో నాని ప్యారడైజ్ లో నటించబోతుండటం విశేషం.

ఈ మధ్య ప్యాన్ ఇండియా మూవీస్ లో కాస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఏ భాషలో టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నా.. వారి పాత్రలకు సెట్ అవుతారు అంటే వెంటనే తీసుకుంటున్నారు. అలా ఇప్పుడు కిల్ హీరో రాఘవ్ జుయాల్ ను ద ప్యారడైజ్ లోకి తీసుకున్నారు. ఈ మూవీతో మనోడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. మరి అతను నెగెటివ్ రోల్ చేస్తున్నాడా లేక దసరా మూవీలో దీక్షిత్ శెట్టిలా నానికి ఫ్రెండ్ గా కనిపిస్తాడా అనేది తెలియదు కానీ.. రాఘవ్ జుయాల్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని అఫీషియల్ గానే ప్రకటించారు మేకర్స్.

Tags

Next Story