King Nagarjuna : తమిళ్ డైరెక్టర్ తో నాగార్జున వందో సినిమా ..?

అక్కినేని నాగార్జున 100వ సినిమా గురించిన వార్తలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో కథలు విన్నాడు నాగ్. బట్ ఏదీ ఒకే చేయడం లేదు. ఆ మధ్య బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో 100వ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరగా నా సామిరంగా మూవీతో విజయం అందుకున్న నాగ్ ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ ల కూలీ చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. దీనికంటే చాలా రోజుల ముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కేబేర మూవీ స్టార్ట్ అయింది. ఈ చిత్రం జూన్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కూలీ ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఇక ఇప్పుడు మరోసారి కింగ్ 100వ చిత్రం గురించిన వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి ఓ తమిళ్ డైరెక్టర్ పేరు వినిపిస్తుండటం విశేషం.
తమిళ్ లో 2022లో నీతమ్ ఒరు వానమ్ అనే చిత్రంతో ఆకట్టుకున్న ‘రా. కార్తీక్’ డైరెక్షన్ లో నాగార్జున 100వ మూవీ ఉండబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కార్తీక్ ఈ మూవీతో తనదైన ఇంప్రెషన్ వేశాడు. అంతకు ముందు రచయితగానూ ఆకట్టుకున్నాడు. అయితే నీతమ్ ఒరు వానమ్ విజయం సాధించినా అతనికి తర్వాత సరైన అవకాశాలు రాలేదు. అలాంటి దర్శకుడిని ఇలా ప్రతిష్టాత్మక చిత్రం కోసం నమ్ముతున్నాడు అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోన్న అంశం. బట్ నాగార్జునకు కొన్ని లెక్కలు ఉంటాయి. అవి సెట్ అయితే ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. మరి ఈ దర్శకుడితో సినిమా అనే విషయం ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com