King Of Kotha Box Office Collection Day 1: మలయాళ చిత్రసీమలో అతిపెద్ద ఓపెనర్‌గా దుల్కర్ మూవీ
అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన, 'కింగ్ ఆఫ్ కోథా' ఆగష్టు 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో నటించిన మోస్ట్-వెయిటింగ్ చిత్రంగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజున, దుల్కర్ సల్మాన్.. 'కింగ్ ఆఫ్ కోథా'తో కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మూవీతో ఆయన మలయాళ సినిమాలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచాడు. మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ చిత్రం.. ప్రారంభ అంచనాల ప్రకారం, మొదటి రోజు 7.70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది 1వ రోజున కేరళలో రూ. 5 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. హైదరాబాద్ RTC X రోడ్స్ నుండి.. అత్యధికంగా డబ్ చేయబడిన మలయాళ గ్రాసర్‌గా ఈ మూవీ నిలిచింది, రూ. 2.90 లక్షల కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది.
యష్ నటించిన బ్లాక్ బస్టర్ 'KGF 2'ని 'కింగ్ ఆఫ్ కోథా' అధిగమిస్తుందని చాలా మంది భావించారు. 'KGF 2' మొదటి రోజు రాష్ట్రంలో రూ. 7.25 కోట్లు రాబట్టగా, దుల్కర్ సల్మాన్ చిత్రం రూ. 5 కోట్లు రాబట్టింది. అయితే మొదటి రోజు రూ.8.20 కోట్లు కలెక్ట్ చేసిన సన్నీడియోల్ 'గదర్ 2'కి ఈ మూవీ ప్రస్తుతం గట్టి పోటీనిస్తోంది.. కానీ, 15వ రోజున రూ.3.25 కోట్లు రాబట్టిన రజనీకాంత్ 'జైలర్'ను వెనక్కి నెట్టగలిగింది. 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు వసూలు చేసింది.
దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ సహకారంతో రూపొందిన 'కింగ్ ఆఫ్ కోథా'లో ప్రసన్న, షబీర్ కల్లరక్కల్, గోకుల్ సురేష్, నైలా ఉష కూడా నటించారు. తన తండ్రి కంటే భిన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకునే రవి కొడుకు టోనీ కథను ఈ చిత్రంలో చూపించారు. అతను సంపన్న నేపథ్యానికి చెందిన ఒక మహిళతో ప్రేమలో పడడంతో కథ ముందుకు సాగుతుంది.
ఇదిలా ఉండగా 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.418.90 కోట్లు వసూలు చేసి, త్వరలో రూ.500 కోట్ల మార్కును చేరుకోనుంది. ఇటీవల, సన్నీ డియోల్ గదర్ 2విజయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. సినిమాను ఈ రేంజ్ లో ప్రేమిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com