Vijay Devarakonda : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే

Vijay Devarakonda :  కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే
X

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్. గత గురువారం విడుదలైన ఈ మూవీకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజే ఏకంగా వాల్డ్ వైడ్ గా 39 కోట్లు వసూలు చేసింది. కాకపోతే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ కారణంగా రెండో రోజు నుంచే వసూళ్లు డల్ అయ్యాయి. అయినా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది అని చెప్పాడు నిర్మాత నాగవంశీ. వీకెండ్ లో అయినా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుందీ అనుకుంటే.. అదీ లేదు. కలెక్షన్స్ సో సో గానే ఉన్నాయి. ఇక ఈ ఆదివారంతో కలిపి కింగ్ డమ్ సాధించిన వసూళ్లు 83 కోట్లు.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీతో విజయ్ కొన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందిని దాటాడు. కానీ పూర్తిగా శాటిస్ ఫైడ్ అయ్యాడా అంటే లేదనే చెప్పాలి. సినిమా సెకండ్ హాఫ్ వీక్ గా ఉందనేది ఓపెన్ మేటర్. అది వాళ్లకూ తెలుసు అని చెప్పారు. ఇది కూడా స్ట్రాంగ్ గా ఉండి ఉంటే సినిమా టాక్ వేరే ఉండేది. అందుకు తగ్గట్టుగా వసూళ్లు కూడా కనిపించేవి. నిజానికి ఇప్పటికే 100 కోట్ల మార్క్ ను దాటేది. ఏదేమైనా విజయ్ ఈ విజయం కొంత ఊరట. కానీ ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సి అవసరం ఇంకా ఉంది. .

Tags

Next Story