Kingdom Trailer : కింగ్ డమ్ ట్రైలర్ ను లేపుతున్నారుగా

Kingdom Trailer :  కింగ్ డమ్ ట్రైలర్ ను లేపుతున్నారుగా
X

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన మూవీ కింగ్ డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఇవాళ తిరుపతిలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ఉంది. రిలీజ్ కు చాలా తక్కువ టైమ్ ఉంది. ఇప్పటి వరకూ కేవలం సందీప్ రెడ్డి వంగాతో ఒక ఇంటర్వ్యూ మాత్రమే చేయించారు. అది కూడా ఏమంత ఆకట్టుకోలేదు. అంటే సినిమాకు హైప్ తేలేకపోయింది. అంచనాలూ పెంచలేదు. ఇక అందరి దృష్టీ ట్రైలర్ పై ఉంది.

ఇక ట్రైలర్ ఓ రేంజ్ లో ఉందనీ, బ్లాస్టింగ్ గా ఉందని.. నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఓ సీనియర్ జర్నలిస్ట్ చేత కూడా హైప్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే కొన్ని డౌట్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి అనే సినిమా వారి సామెత గుర్తొస్తుంది. నిజంగా బావున్నా కూడా వీరి వల్ల అంచనాలు ఎక్కువగా పెంచుకుంటే అప్పుడూ మైనస్ అవుతుంది. ట్రైలర్ బావుంది.. అందరికీ నచ్చుతుంది లాంటివి వరకూ ఓకే. కానీ ఇలా భారీ హైప్ పెంచే ప్రయత్నం చేస్తే అనుమానాలు వస్తాయనేది ఇప్పటి ప్రేక్షకులు గురించి బాగా తెలిసిన నాగవంశీకి అర్థం కాదు అనుకోలేం.

ఏదేమైనా విజయ్ దేవరకొండకు ఇప్పుడు అర్జెంట్ గా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలి. అది కింగ్ డమ్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకానికి కారణాలు ఏవైనా.. మూవీ విజయం సాధిస్తే ఇండస్ట్రీకి కూడా మంచిదే.

Tags

Next Story