నాగార్జున ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ.. ప్రీ లుక్‌ అదిరింది..!

నాగార్జున ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ.. ప్రీ లుక్‌ అదిరింది..!
Nagarjuna New Movie: కింగ్ నాగార్జున జోరు పెంచారు. ఒకవైపు బిగ్ బాస్ షోతో బీజీగా ఉంటూనే..వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు.

Nagarjuna New Movie: కింగ్ నాగార్జున జోరు పెంచారు. ఒకవైపు బిగ్ బాస్ షోతో బీజీగా ఉంటూనే..వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 'బంగార్రాజు' మూవీ సెట్స్ పైకి ఉండగానే.. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఇటీవలే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. అయితే పరిస్థితులు చక్కబడటంతో మళ్ళీ ఈ సినిమాను సెట్స్ మీదకు తెచ్చింది చిత్రయూనిట్.

ప్రవీణ్ సత్తారు - నాగ్ మూవీ చెందిన అప్ డేట్ ఆగస్టు 29వ తేదీన రాబోతుందనే విషయాన్ని తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్‌ను రివీల్ చేయకుండా పూర్తి నలుపు రంగు దుస్తుల్లో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఈ పోస్టర్‌లో చూపించారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతోంది. నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29వ తేదీ కావడంతో ఆ రోజు స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని చెప్పారు. దీంతో ఆ అప్‌డేట్ పట్ల అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


Tags

Read MoreRead Less
Next Story