Kiran Abbavaraam : ప్రేమ చాలా గొప్పది.. దిల్ రుబా టీజర్

Kiran Abbavaraam :  ప్రేమ చాలా గొప్పది.. దిల్ రుబా టీజర్
X

‘క’ మూవీతో 2024 ను కెరీర్ బెస్ట్ ఇయర్ గా మార్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. తనపై వచ్చే ట్రోల్స్ కు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసిన ఇయర్ అది. తన నమ్మకం నిజమై.. ఓ సాధారణ హీరో నుంచి టైర్ టూ స్టేజ్ ఉన్నవాడుగా ప్రూవ్ అయిన ఏడాది. మరి అంత మెమరబుల్ మూవీ తర్వాత వస్తోన్న సినిమా అంటే కాస్త ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ ఒత్తిడిని అతను జయిస్తాడు అనేలా ఉంది కిరణ్ లేటెస్ట్ మూవీ దిల్ రూబా టీజర్ చూస్తే. యస్.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా దిల్ రుబా. కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. నజియా డేవిసన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా ఉంది. విశ్వ కరుణ్ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నిజానికి ఈ మూవీ ‘క’ కంటే ముందే రావాల్సింది. కానీ అతనెందుకు దిల్ రుబా కంటే క నే ఎక్కువగా నమ్మాడు. అందుకే ఇది కాస్త లేట్ అయింది. లేట్ అయినా ఫర్వాలేదు.. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న మూవీ కాబట్టి సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతోన్న సినిమా అని సర్ది చెప్పుకునేలా ఉంది టీజర్.

మామూలుగా లవ్ స్టోరీస్ లో పెయిన్ ఉంటే ఆడియన్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతుందంటారు. ఆ పెయిన్ యూనిక్ గా ఉండాలి. అందరూ ఓన్ చేసుకునేలా ఉండాలి. దిల్ రుబా టీజర్ అట్లానే ఉంది.

‘మ్యాగీ.. మై ఫస్ట్ లవ్.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలైనట్టు మ్యాగీతో లవ్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు కింగ్(సిగరెట్) జాన్(విస్కీ) అనే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్లిచ్చిన కాన్ఫిడెన్స్ తో అమ్మాయిలకి, ప్రేమకు చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చిపోతే సెప్టెంబర్ వచ్చినట్టు నా లైఫ్ లోకి అంజలి వచ్చింది.. ’అనే కిరణ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్.. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా కనిపించిందనే చెప్పాలి. కాలేజ్ లో అంజలితో కూడా ఇష్యూస్ రావడం.. తనను గట్టిగా పట్టుకుని.. ‘నా చేతిలో గన్నుంటే కాల్పి పడదొబ్బేవాణ్ని తెలుసా’ అని కిరణ్ అంటే.. ‘రేపు తీసుకొస్తాను.. వేసెయ్’ అని హీరోయిన్ అనడం.. బావుంది. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్.. ఫ్రెండ్స్ కు సంబంధించిన కంటెంట్ తో పాటు ఓ ప్రెగ్నెంట్ లేడీ కీలకంగా ఉండబోతోంది అనేలా మరికొన్ని సన్నివేశాలు.. అన్నీ బావున్నాయి. చివర్లో ‘ప్రేమ చాలా గొప్పది.. కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ చూస్తే ఇతను మళ్లీ ప్రేమలో ఫెయిల్ అయ్యాడా అనిపిస్తుంది.

‘అతని ప్రేమ అతని కోపం’ అనే క్యాప్షన్ తో కనిపిస్తోన్న దిల్ రుబా టీజర్ తో కిరణ్ అబ్బవరం మరో మెట్టు పైకి ఎక్కేశాడు. కాకపోతే టీజర్ తోనే రిజల్ట్ తేలిపోదు కదా. ఇప్పటికి టీజర్ బావుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అంటున్న సినిమా వస్తే కానీ.. అసలు మేటర్ తెలియదు. అన్నట్టు టీజర్ కు మెయిన్ హైలెట్ గా శ్యామ్ సిఎస్ నేపథ్య సంగీతం కనిపిస్తోంది. అతనే క మూవీ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఏదేమైనా క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సరైన కంటెంట్ తోనే వస్తున్నాడేమో అనేలా ఉంది అని మాత్రం చెప్పొచ్చు.

Tags

Next Story