Kiran Abbavaraam : కే ర్యాంప్ గ్లింప్స్ .. కిరణ్ అబ్బవరం ప్రేమ సందేశం

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘కే ర్యాంప్’. జైన్స్ నాని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కిరణ్ కు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా కిరణ్ బర్త్ డే గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ మొత్తం బూతులతో నింపేశారు. అది ఆ క్యారెక్టర్ ను చూపించేలా కనిపిస్తోంది. అంటే కొన్ని క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలు ఉంటాయి కదా.. అలాంటి పాత్రే ఈ మూవీలో కిరణ్ చేస్తున్నాడు అనిపించేలా ఉంది.
చాట్లూ(అన్నలూ) ఎల్లారుక్కుం నమస్కారం.. ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు బుడ్డలు జారే.. అంటూ కిరణ్ డైలాగ్ తో మొదలైన టీజర్ లో.. అతన్ని ఒక వ్యక్తి కుమార్ లైఫ్ లా ఉంది అని అడిగితే.. నా మొ.. అనే డైలాగ్. బార్ లో గొడవైతే మ్యాన్షన్ హౌస్ ఎత్తి పట్టి తాగడం.. ఇవన్నీ ఎంటర్టైనింగ్ గానే ఉన్నాయి. చివర్లో ‘ఏఎమ్.బి సినిమాల్ లో మళయాల ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం.. కానీ తెలుగు సినిమా ప్రేమకథలతోనే మనకు ప్రాబ్లమ్ .. ఎందుకంటే వాళ్ల దాంట్లో ఉండే ఆథెంటిసిటీ మనదాంట్లో ఉండదు.. మనిద్దరి ప్రేమ గుడిసిపోయినా ఫర్లా.. ప్రేమ మాత్రం బావుండాలి..’ అంటూ సందేశాలు కూడా చెప్పాడు. ఏదైనా కిరణ్ ఇన్ని బూతులతో రావడం ఇదే ఫస్ట్ టైమ్. అసలే మనోడు ట్రోలర్స్ కు ఈజీ టార్గెట్. ఏ మాత్రం తేడా వచ్చినా డ్యామేజ్ డబుల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఈ యేడాది దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com