Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ను టాలీవుడ్ గుర్తించినట్టేనా

Kiran Abbavaram :  కిరణ్ అబ్బవరం ను టాలీవుడ్ గుర్తించినట్టేనా
X

కిరణ్ అబ్బవరం .. అవుట్ సైడర్ గా ఇండస్ట్రీకి వచ్చాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. పెద్ద అందగాడూ కాదు. ఎక్స్ ట్రీమ్ లీ టాలెంటెడ్ అని కూడా అనిపించుకోలేదు. తన పాటికి తను ఏవేవో సినిమాలు చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఫస్ట్ మూవీ రాజా వారు రాణిగారుతోనే ఆకట్టుకున్నాడు. ఆ మూవీ థీమ్ మెప్పించింది. హీరో, హీరోయిన్ మధ్య ట్రాక్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం ఆకట్టుకుంది. సమ్మతమే ఓకే అనిపించుకుంది. తర్వాత ఫ్లాపులు. పైగా ఇవన్నీ నెలల గ్యాప్ లోనే రిలీజ్ కావడంతో అతనిపై ట్రోలింగ్ మొదలైంది. కిరణ్ కథ ముగిసింది ఇక సర్దేసుకోవడమే అనుకున్నారు. మరోవైపు కొందరు పనికట్టుకుని మరీ విపరీతంగా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు కూడా. ఇవన్నీ తట్టుకుని కొన్నాళ్ల క్రితమే మరో సినిమాతో వస్తున్నా హిట్టు కొడుతున్నా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అప్పుడూ ట్రోల్సే వచ్చాయి.

విశేషం ఏంటంటే.. 'క' ముందు వరకూ కిరణ్ ను ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. పెద్దలెవరూ.. అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి వాళ్లు వారానికొకళ్లు కనిపిస్తారు అనే ధోరణి కనిపించింది. బట్ ఈ మూవీ కిరణ్ విషయంలో అన్నీ మార్చింది. ఇప్పుడు అతన్ని ఇండస్ట్రీ బిగ్గీస్ లో ఒకడైన అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి మరీ అభినందించడం.. ఆ తర్వాత 14రీల్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గోపీ ఆచంట కూడా అతని వద్దకే వెళ్లి మరీ అభినందించాడు. వీరి కంటే ముందు సినిమా రిజల్ట్ తెలియకుండానే నాగ చైతన్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చి కిరణ్ కు నేను అభిమానిని అని చెప్పడం చూస్తే అతనికి రిజల్ట్ ఆల్రెడీ తెలుసేమో అనిపిస్తుంది. మొత్తంగా అల్లు అరవింద్ వంటి ప్రొడ్యూసర్ స్వయంగా వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఇండస్ట్రీలో కిరణ్ కు దక్కిన గౌరవంగానే చూడాలి. బట్ ఇక్కడ ఈ గౌరవాలు.. విజయాలు ఉన్నంత వరకే ఉంటాయి. అందుకే కిరణ్ కూడా ఇలాంటివి మైండ్ లోకి తీసుకోకుండా తను ఆ మధ్య చెప్పినట్టుగానే మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంచుకునే కథల విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఏదేమైనా ఈ సినిమా కిరణ్ అబ్బవరం జీవితంలో మరపురానిదిగా మిగిలిపోతుందనే చెప్పాలి.

Tags

Next Story