Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఈ సారి కొడితే రేంజే మారుతుంది

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఈ సారి కొడితే రేంజే మారుతుంది
X
చిన్న హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న కిరణ్ అబ్బవరంకు అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ ను కొల్లగొడితే అతని రేంజే మారిపోతుంది.

చిన్న సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఒకట్రెండు సినిమాలు ఓకే అనిపించుకున్నా తర్వాత గాడి తప్పాడు. అసలే ఇమేజ్ లేదు. మార్కెట్ లేదు అంటే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అలాంటి హీరో మార్కెట్ ఒకేసారి మూడు నాలుగు రెట్లు పెరిగితే ఎవరికైనా ఆశ్చర్యమే.అయితే ఇక్కడ హీరో మార్కెట్ ను కంటెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ కంటెంట్ ఉందేమో అనిపించేలా అతని కొత్త సినిమా ‘క’ టీజర్ కనిపించింది. టీజర్ చూస్తే పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామాలా అనిపించింది. ఈ జానర్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది బయ్యర్స్ ఈ మూవీకోసం చూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 12 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేశారట. నిజానికి కిరణ్ మార్కెట్ 3 - 4 కోట్ల మధ్యే ఉంటుంది. అలాంటిది ఒకేసారి 12 కోట్లు అంటే మాటలా. అది కూడా కేవలం టీజర చూసే ఈ రేంజ్ పెట్టారంటే విశేషమే.

శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని సుజిత్ - సందీప్ ద్వయం డైరెక్ట్ చేశారు. అంటే ఇద్దరు దర్శకులు కలిసి రూపొందించారన్నమాట. వారి కష్టం ఫలించేలానే మార్కెట్ కావడం పెద్ద విషయం. ఇక కిరణ్ తో పాటు తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం విజయం సాధించి ఆ పన్నెండు కోట్లను సాధించగలిగితే ఖచ్చితంగా అతని రేంజ్ మారుతుంది. ఇప్పటికే కిరణ్ పై చాలా ట్రోల్స్ ఉన్నాయి. హీరోగా పనికి రాడు అనేవాళ్లూ ఉన్నారు. అయినా అన్నిటినీ భరిస్తూ నిలబడుతున్నాడు. ఈ తరుణంలో క మూవీ హిట్ అయితే అతనిపై ఈ ట్రోల్స్ అన్నీ ఆగిపోతాయి.

Tags

Next Story