Kiran Abbavaram : 'క'లిసి వచ్చిన కాలం.. దిల్ రుబాతో మాయం

చేతులారా చేసుకున్నాడు అంటుంటారు కదా.. అలాగే ఇప్పుడు కిరణ్ అబ్బవరం గురించి అనుకుంటున్నారు. అతని కెరీర్'క'కు ముందు 'క'కు తర్వాత అన్నట్టుగా చేసుకున్నాడు. తాజాగా వచ్చిన అతని దిల్ రుబా దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ మూవీకి ఒక్క రివ్యూ కూడా పాజిటివ్ గా లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కిరణ్ తన దారిని అస్సలు మార్చుకోలేదు అని చెప్పడానికి. కథలో పస లేదు. దారి తెన్నూ లేని కథనంతో దిల్ రుబా ఆడియన్స్ నుంచి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటోంది.
క మూవీ లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీస్ లో హయ్యొస్ట్ వసూళ్లు సాధించిన పది సినిమాల్లో ఒకటి. అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ పూర్తిగా అదే దారిలో కాకపోయిన ఖచ్చితంగా కంటిన్యూటీ ఉండేలా చూసుకుంటే బావుండేది. పైగా ప్రేక్షకులు కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తారు. బట్ అందుకు భిన్నమైన కథతో వచ్చి క మూవీ ఇచ్చిన బూస్టప్ ను తనే బ్యాడ్ చేసుకున్నాడు అంటున్నారు.అలాగని అతనేం కావాలని చేసుకున్నాడు అని కాదు. బట్.. కెరీర్ లో ఎదుగుతున్నప్పుడు.. తనే చెప్పుకున్నట్టు కొందరు కావాలనే తనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి వారికి సినిమాల విజయాలతోనే సమాధానం చెప్పాలి. అలా క మూవీ అతనికి పెద్ద ఎసెట్ అయింది. ఆ ఎసెన్సీని కంటిన్యూ చేసేలా ఉంటే బావుండేది అంటున్నారు చాలామంది.
ఏదేమైనా దిల్ రుబా ఫలితాన్ని అతను ఊహించలేదు అనే చెప్పాలి. ఎందుకంటే మూవీ విడుదలకు ముందు వరకు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. తను ఫైట్లు చేశానని కావొచ్చు.. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని కావొచ్చు, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఉందనీ కావొచ్చు. కానీ ఇవన్నీ సీక్వెన్స్ లుగానే చూడాలి. ఆ సీక్వెన్స్ లను కట్టిపడేసే కథ, కథనం ఆడియన్స్ ను హత్తుకుంటేనే ఆకట్టుకుంటారు. లేదంటే దిల్ రుబా లాంటి ఫలితాలే వస్తుంటాయి. సో.. కిరణ్ అబ్బవరం ఇకనైనా కాస్త జాగ్రత్త పడితే మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com