Kiran Abbavaram : ఇది కిరణ్ అబ్బవరం కొత్త స్ట్రాటజీనా

Kiran Abbavaram :  ఇది కిరణ్ అబ్బవరం కొత్త స్ట్రాటజీనా
X

‘క’ తో ఇండస్ట్రీ మొత్తానికి తనేంటో నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ మూవీ అతనికి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చిన్నది కాదు. అతన్లానే బయటి నుంచి వచ్చి ఇండస్ట్రీలో నిలబడదాం అనుకునే వారందరికీ క మూవీతో ఓ ఇన్సిస్పిరేషన్ నే నింపాడు కిరణ్. ఈ నెలలో అతని కొత్త సినిమా ‘దిల్ రూబా’ విడుదల కాబోతోంది. రుక్షర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈచిత్రంతో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. అయితే క మూవీ టైటిల్ విషయంలో ఎవరికీ దాని అర్థం గురించి స్పష్టత లేదు. దీంతో సింపుల్ గా కిరణ్ లో కే.. అబ్బవరంలో ఏ తీసుకుని అలా పెట్టాడేమో అని సరిపెట్టుకున్నారు.

అయితే లేటెస్ట్ గా అతని మరో సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. యుక్తి తరేజా హీరోయిన్. సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. జైన్ నాని ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ‘సామజవరగమన’, ‘ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత హాస్య మూవీస్ బ్యానర్‌లో రాజేష్ దండ నిర్మిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ మూవీ టైటిల్ కూడా కొత్తగానే పెట్టారు మేకర్స్.

‘కే - ర్యాంప్’.. ఇదీ కిరణ్ కొత్త సినిమా టైటిల్. అంటే కిరణ్ ర్యాంప్ అనుకోవాలా లేకే సినిమాలో కే అనేదానికి కొత్తగా ఇంకేదైనా అర్థం ఉంటుందా అనేది తెలియదు కానీ.. ఈ కే ర్యాంప్ ఫుట్ బాల్ గేమ్ నేపథ్యంలో ఉంటుందని టాక్. మొత్తంగా ‘క’, ‘కే’ లాంటి టైటిల్స్ తో ఆడియన్స్ లో ఆసక్తి పెంచడమే కిరణ్ అబ్బవరం స్ట్రాటజీయా అనిపిస్తోంది కదా.

Tags

Next Story