Kiran Abbavaram : 'క' తో ఖలేజా చూపాలి కిరణ్

Noస్వయంకృషితో ఎదుగుతూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఫస్ట్ మూవీ హిట్. నెక్ట్స్ మూవీ హిట్. కానీ ఆ తర్వాతే అతనికి విజయాలు మొహం చాటేశాయి. సరైన కథలు పడలేదు. వినరోభాగ్యము విష్ణు కథ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఇప్పుడు 'క' అనే థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. రీసెంట్ గా తన ఫస్ట్ మూవీ హీరోయిన్ నే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నారు. అందుకే వీరికి చాలా ఇంపార్టెంట్ మూవీగా మారింది క.
క ముందు నుంచి పాజిటివ్ గానే కనిపించింది. టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్.. అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. దీనికి మించి టేబిల్ ప్రాఫిట్ అనేలా భారీ రేట్లకు సినిమా ఎప్పుడో అమ్ముడు పోయింది. ఆ మొత్తాన్ని ఇప్పుడు సినిమా రాబట్టాలి. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. కానీ ప్రమోషన్స్ ఆ స్థాయిలో లేవు. కేవలం తెలుగు పైనే పూర్తిగా ఫోకస్ చేశారు. అఫ్ కోర్స్ కిరణ్ ఇప్పుడు ఇక్కడే స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాలి. తనకంటూ గట్టి మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి క పెద్ద ఎసెట్ కాబోతోందని నమ్ముతున్నాడు.
ఇక సినిమాక సంబంధించి సుజిత్, సందీప్ ద్వయం డైరెక్ట్ చేశారు. కంటెంట్ పరంగా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. థ్రిల్లర్ సినిమాలు కరెక్ట మీటర్ లో ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఈ మూవీ అలాగే కనిపిస్తోంది. 1980ల నేపథ్యం, పోస్ట్ మేన్ మిగతా వారి ఉత్తరాలు చదవడం.. తద్వారా తనకు కుటుంబం లేని లోటును తీర్చుకోవడంతో పాటు తను ఉన్న ఊరికి ఆపద వస్తే అడ్డుగా నిలవడం అందుకోసం ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం వంటి అంశాలు కనిపించాయి ట్రైలర్ లో. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ లాగే ఉండటం కిరణ్ కు బాగా కలిసొచ్చే మేటర్ అని చెప్పాలి. క మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క తో ఖలేజా చూపగలిగితే కిరణ్ మరో మెట్టు ఎక్కుతాడు అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com