Dilruba Trailer : దిల్ రుబా ట్రైలర్ .. తప్పు చేయని ప్రతి వాడూ హీరోనే

Dilruba Trailer :  దిల్ రుబా ట్రైలర్ .. తప్పు చేయని ప్రతి వాడూ హీరోనే
X

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘దిల్ రుబా’. రుక్సర్ థిల్లాన్, కేథీ డేవిసన్ హీరోయిన్లు గా నటించిన ఈ మూవీని విశ్వ కరుణ్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న దిల్ రుబా ట్రైలర్ ను విడుదల చేశారు. దిల్ రుబాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి కంటెంట్ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ప్రేమతో పాటు యాక్షన్ కూ చాలా ఎక్కువ స్కోప్ ఉంది. తప్పు చేయని ప్రతి వాడూ హీరోనే.. చేసిన తప్పును తెలుసుకున్నవాడు ఇంకా పెద్ద హీరో అని నమ్ముతూ, తప్పు చేయకపోతే సారీ చెప్పే ప్రసక్తే లేదని ఖరాకండీగా నిలిచే హీరో క్యారెక్టరైజేషన్ ఈసినిమాకు హైలెట్ లా కనిపిస్తోంది. ఏ లక్షణం చూసి హీరోయిన్ అతనితో ప్రేమలో పడుతుందో.. ఆ లక్షణం వల్లే వదులుకుని పోతుందేమో అనేలా ఉంది.

‘దేవుడెప్పుడు మాట్లాడ్డం మానేశాడో తెలుసా సిద్ధూ.. మనిషి మోసం చేయడం మొదలుపెట్టినప్పుడు’, ‘ప్రేమ చాలా గొప్పది మ్యాగీ.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది..’, ‘ప్రేమ గొప్పది కాదు.. అదిచ్చే మనిషి గొప్ప..’ అంటూ భిన్నమైన వ్యక్తుల కోణంలో చెప్పిన డైలాగ్స్ చాలా బావున్నాయి. కిరణ్ అబ్బవరం కు ‘క’ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చాలా పెద్దది. ఈ సినిమా కూడా అదే స్థాయి కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశాలున్నట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

రుక్సర్ థిల్లాన్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తే అదే కాలేజ్ లో కిరణ్ ఎక్స్ కనిపించడం.. ఏదో ఒక ట్విస్ట్ లా ఉంది. ప్రేమతో పాటు కుటుంబం, ఫాదర్ సెంటిమెంట్ ఇలా.. చాలా అంశాలే కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ బ్యాలన్స్ డ్ గా చూపించే స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంటే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడే అవకాశాలున్నాయి.

Tags

Next Story