Kiran Abbavaram : 50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం ‘క’

Kiran Abbavaram :  50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం ‘క’
X

థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకుని థర్డ్ వీక్ ప్రదర్శితమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ “క“ సినిమాకు మంచి వసూళ్లు దక్కాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైలా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారని చెప్పేందుకు కిరణ్ అబ్బవరం “క“ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా.. ఈ నెల 22న మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

Tags

Next Story